పార్కింగ్ సమస్య పరిష్కరించడానికి సలహాలివ్వండి.. : మంత్రి కేటీఆర్

పార్కింగ్ సమస్య పరిష్కరించడానికి  సలహాలివ్వండి.. : మంత్రి కేటీఆర్

దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ సమస్య పెను సవాలుగా మారుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని పార్కింగ్ సమస్యల్ని పరిష్కిరించాలని కోరుతూ ఆయన ట్విటర్లో నెటిజన్లను కోరారు. హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో  పార్కింగ్‌ ప్రధాన సమస్యగా మారింది. 

సికింద్రాబాద్‌, ఓల్డ్‌ సిటీల్లోని మార్కెట్లకు దగ్గరలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి.. అందులో పార్కింగ్ కోసం బిల్డింగ్‌లను నిర్మించాలని బిపిన్‌ సక్సేనా అనే  నెటిజన్  ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ను కోరారు. 

ఈ మేరకు ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించే ఐడియాతో ఒక వీడియోను పోస్టు చేశారు.  స్పందించిన మంత్రి .. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు పార్కింగ్‌ అనేది ప్రధాన సమస్యగా మారిందన్నారు.  

పార్కింగ్‌ సమస్య  తలెత్తకూడదనే..  కొత్తగా నిర్మించబోయే మెట్రో మార్గాల్లో పెద్ద ఎత్తున పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేసి పార్క్‌ అండ్‌ రైడ్‌ మోడ్‌ను ప్రయోగాత్మకంగా ప్రయత్నించబోతున్నామని వివరించారు. పార్కింగ్ ప్రాబ్లెమ్ పరిష్కరించడానికి పలువురు నెటిజన్లు సూచనలు చేశారు.