వ్యవ‌సాయం నుంచి ఐటీ వరకు అగ్ర భాగాన తెలంగాణ

వ్యవ‌సాయం నుంచి ఐటీ వరకు అగ్ర భాగాన తెలంగాణ

తెలంగాణ గొప్పత‌నం తెలుసుకోవాలంటే గుగూల్ ని అడగండి అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ఎక్కడ ఉంది? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రెండింటికి సమాధానం తెలంగాణనే అని, వాటిని కేసీఆర్ ప్రభుత్వం నిర్మించ‌డం గ‌ర్వకార‌ణంగా ఉంద‌ని మంత్రి తన ట్వీట్ లో పేర్కొన్నారు. వ్యవ‌సాయం నుంచి ఐటీ వరకు తెలంగాణ  అగ్రభాగాన ఉందని కేటీఆర్ ట్వీట్ లో తెలిపారు.