
మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు బీజేపీలో మున్నాభాయ్, MBBS రకాలు ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా నకిలీ సర్టిఫికేట్ కలిగి ఉన్నారంటూ కేటీఆర్ తన ట్వీట్ లో ఆరోపించారు.
రాజస్థాన్ , తమిళనాడు విశ్వవిద్యాలయాల నుంచి వారికి నకిలీ సర్టిఫికేట్లు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో అబద్దం చెప్పడం క్రిమినల్ నేరం కాదా అని ప్రశ్నించారు. లోక్ సభ స్పీకర్ దీనిని నిర్దారించకూడదా? దోషులుగా తేలితే అనర్హత వేటు వేయచ్చు కదా అని కేటీఆర్ తన ట్వీట్ లో ప్రశ్ని్ంచారు.