ఈ నెల 8న తొర్రూరులో మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటన

 ఈ నెల 8న  తొర్రూరులో  మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటన

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఈ నెల 8 న మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటించనున్నారు. ఈ సంద ర్భంగా పట్టణంలో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చిల్డన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించి, ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం రోడ్డులో 20వేల మంది మహిళలతో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరై, రూ. 300 కోట్ల విలువైన బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింకేజీ రుణాలను పంపిణీ చేస్తారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాక సందర్భంగా తొర్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీ, సమీప గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైం తొర్రూకు వస్తున్నందున ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ మండలాల నుంచి మహిళలు, ప్రజలను తరలించేందుకు వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటుచేశారు. గ్రామాలవారీగా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జులను నియమించారు. 

ఏనుగల్లులో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

పర్వతగిరి, వెలుగు: వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా పర్వతగిరి మం డలం ఏనుగల్లుకు ఈ నెల 8న మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రానున్నందున ఏర్పాట్లను సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూ రి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశీలించారు. హెలిప్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సభా స్థలం, పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిమ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయనున్న ఉచిత స్క్రీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం జిల్లా ఆఫీసర్లతో మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోపి, ఆర్డీవో మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీఆర్డీవో పీడీ సంపత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఎంపీడీవో సంతోశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.