వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా చర్యలు..

వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా చర్యలు..

వచ్చే వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వెల్లడించారు.శనివారం ఆయన ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్ లో 4 కోట్ల 38 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి,ఉప్పల్ ఎమ్మెల్యే బెతి సుభాష్ రెడ్డి,చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ లు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. చిలక నగర్ డివిజన్లోని పలు ప్రాంతాలలో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనుల మరమ్మతులు మరియు నూతన డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు, చిలుక నగర్ డివిజన్లోని వార్డు కార్యాలయంలో మీటింగ్ హాల్ కి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.రానున్న వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన అభివృద్ది పనులను పూర్తి చేసి.. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ది చెందుతోంది. పట్టణ,పల్లే ప్రగతి దేశానికే ఆదర్శం అన్నారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రతీ మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ది జరుతున్నాయన్నారు మంత్రి మల్లారెడ్డి.