మంత్రి మల్లారెడ్డి స్వార్థపరుడు : తోటకూర వజ్రేశ్ యాదవ్

మంత్రి మల్లారెడ్డి స్వార్థపరుడు : తోటకూర వజ్రేశ్ యాదవ్

ఘట్‌ కేసర్, వెలుగు : మంత్రి మల్లారెడ్డి లాగా తాను మాటలతో మాయ చేసే మనిషిని కాదని.. గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్​యాదవ్ తెలిపారు. సోమవారం ఘట్ కేసర్ మండలం ఔషాపూర్, మరిపెల్లిగూడెం, ఏదులాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు

మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ.. ఘట్ కేసర్ మండలానికి అభివృద్ధికి మల్లారెడ్డి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను 100 శాతం అమలు చేస్తామని ప్రకటించారు.