నా కొడుకును కొట్టిన్రు.. అందుకే హాస్పిటల్ పాలైండు: మల్లారెడ్డి

నా కొడుకును కొట్టిన్రు.. అందుకే హాస్పిటల్ పాలైండు: మల్లారెడ్డి

రాజకీయ కక్షతోనే బీజేపీ తనతో పాటు తన బంధువులపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కొడుకు మహేందర్ రెడ్డిని పరామర్శించేందుకు నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు వెళ్లారు. ఐటీ అధికారులు ఆయనతో పాటు అక్కడకు వెళ్లారు. ఐటీ రైడ్స్ పేరుతో ఇన్ కం ట్యాక్స్ అధికారులు వేధించడం, సీఆర్పీఎఫ్ అధికారులు కొట్టడంతోనే తన కొడుకు హాస్పిటల్ పాలయ్యాడని మల్లారెడ్డి ఆరోపించారు. కాలేజీలు పెట్టి సేవ చేస్తున్నామే తప్ప ఎలాంటి దొంగ వ్యాపారాలు, క్యాసినోలు నడపట్లేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఐటీ దాడులు చేస్తున్నారన్న మల్లారెడ్డి.. 200 మంది అధికారులను పంపి భయపెడతారా అని ప్రశ్నించారు.

మంత్రి మల్లారెడ్డి నివాసంలో నిన్న ఉదయం 6 గంటల నుంచి ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా సోదాలు కంటిన్యూ చేయనున్నారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి పెద్ద కొడుకు మహేందర్ రెడ్డికి ఛాతీ నొప్పి రావడంతో ఆయనను నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం అక్కడే ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు.