
శామీర్పేట, వెలుగు : కొత్త రిజిస్టర్లో ‘‘పోలీస్ స్టేషన్’’ అని రాసేందుకు మంత్రి మల్లారెడ్డి స్పెల్లింగ్ అడిగి అందరిని ఆశ్చ ర్యానికి గురిచేశారు. సోమవారం ఆయన మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం జీనోమ్ వ్యాలీలో కొత్త పీఎస్ ప్రారంభించారు. తర్వాత స్టేషన్లోని కొత్త రిజిస్టర్ బుక్లో ‘‘పోలీస్ స్టేషన్’’ అని రాయడానికి పెన్ను పట్టుకున్నారు. డేట్ వేసిన తర్వాత ‘‘పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ చెప్పు’’ అని పక్కనే ఉన్న పోలీసులను అడిగారు. ఖంగుతిన్న అధి కారులు..మంత్రి కావాలనే అడిగారా లేక నిజంగానే తెలియదా అనే అయోమయా నికి గురయ్యారు. స్పెల్లింగ్ చెప్పడంతో మల్లారెడ్డి "పోలీస్ స్టేషన్" అని రిజిస్టర్ బుక్లో రాశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.