కీసరలో ముఖ్యమంత్రి కప్ -2023 క్రీడా పోటీలు ప్రారంభం

కీసరలో ముఖ్యమంత్రి కప్ -2023 క్రీడా పోటీలు ప్రారంభం

మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. చాలామంది యువతీ యువకులకు ఎంతో టాలెంట్ ఉండి కూడా గ్రామాలకే పరిమితం అవుతున్నారని.. వారిని వెలుగులోకి తీసుకొచ్చి.. ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కీసరగుట్ట రెసిడెన్షియల్ క్రీడా మైదానంలో ముఖ్యమంత్రి కప్-2023 క్రీడా పోటీలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కప్ 2023 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టిందని..15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సున్న యువతీ, యువకులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మే 31వ తేదీ వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. సోమవారం (మే 15) నుంచి మూడు రోజులపాటు అథ్లెటిక్స్,కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్ బాల్ వంటి విభాగాల్లో మండల స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మండల స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని వెల్లడించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి యువకులతో కలిసి కాసేపు సరదాగా వాలీబాల్ ఆడారు.