కేసీఆర్ పాలనలో వద్దంటే వానలు వస్తున్నయి

కేసీఆర్ పాలనలో వద్దంటే వానలు వస్తున్నయి

హైదరాబాద్: కేసీఆర్ పాలనలో వానలు వద్దంటే వస్తున్నయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వానలు చాలని వాన దేవుడికి దండం పెడుతున్నానని ఆయన అన్నారు. జలవిహార్‎లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.

‘దేశంలోనే ఏ పార్టీకి లేని సభ్యత్వం టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇది ఒక చరిత్ర. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. కేసీఆర్ పాలనలో వానలు వద్దంటే వస్తున్నయి. నేను వాన దేవుడికి దండం పెడుతున్న.. ఇక వానలు చాలు. రాష్ట్రంలో పనికి రాని వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. మనం ఎవరికీ భయపడొద్దు. మనం పని చేస్తున్నాం. కార్యకర్తలు సైనికులు వలే అలెర్ట్‎గా ఉండాలి. కొందరు దొంగలు ప్రభుత్వంపై ప్రజల్లో అసమ్మతి వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. మరో 20 ఏళ్ళు మనదే ప్రభుత్వం’ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

మరో 20 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటది: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల సభ్యత్వం ఉండటం గొప్ప విషయం. అన్ని విషయాల్లో మహిళల ప్రాధాన్యతను కేసీఆర్ పెంచారు. ఢిల్లీలో టీఆర్ఎస్ భవనం నిర్మాణం అనేది ఒక చరిత్ర. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మరో 20 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటది.