చంద్రబాబు ఊసరవెల్లి కబుర్లు జనం నమ్మరు.. పాతహమీలనే బూజు దులిపి చెప్పిండు

 చంద్రబాబు ఊసరవెల్లి కబుర్లు జనం నమ్మరు.. పాతహమీలనే బూజు దులిపి చెప్పిండు

పేదల చేతుల్లోనే బాబుకు శాశ్వతంగా రాజకీయ సమాధి ఖాయమని ఏపీ మంత్రి శ్రీ మేరుగు నాగార్జున అన్నారు.  బాబు ఊసరవెల్లి కబుర్లు జనం నమ్మరని చెప్పారు. సీఎం జగన్ విశ్వసనీయతకు బాబు వెన్నుపోటుకు మధ్య పోటీ అని..ఈ పోటీలో జగన్ మళ్లీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. అధికారంలో ఉన్నప్పుడు మేలు చేయనివాడు.. మళ్ళీ అధికారం ఇస్తే చేస్తాడా..? అని ప్రశ్నించాడు. 

2014 ఎన్నికల మేనిఫెస్టో హామీలన్నీ బాబు గాలికొదిలేశాడని.. 650కి పైగా హామీల్లో 10శాతం కూడా నెరవేర్చలేదని మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు.  ప్రజలు నిలదీస్తారని మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. ఇప్పుడు పాతహమీల్నే బూజు దులిపి చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. బాబు  హయాంలో చెప్పుకోదగ్గ పథకమేదీ లేదన్నారు. తానేం చేశానో చెప్పుకోలేని బాబు సిగ్గుతో తలదించుకోవాలని చురకలంటించారు. ఫలానా మేలు జరిగిందంటే చర్చిద్దాం.. బాబు వస్తాడా..? అని సవాల్ విసిరారు. 

 జన్మభూమి కమిటీల దోపిడీని ప్రజలు మరిచిపోలేదని..  మహానాడు వేదిక వాగ్దానాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. పేదల వ్యతిరేకి చంద్రబాబు అని 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు పూర్, రిచ్‌ తేడా గుర్తుకురాలేదా బాబూ..? అని మంత్రి మేరుగు నాగార్జున నిలదీశారు.  ఆయన అధికారంలో ఉన్నప్పుడు పెత్తందార్లకే కొమ్ముకాశాడని.. పేదపిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్య వద్దన్నాడని గుర్తు చేశారు. పేదలకు ఇచ్చే ఇళ్లను సమాధులతో పోల్చాడని.. పెత్తందార్లతో కలిసి కోర్టులకెళ్లి అడుగడుగునా అడ్డుపడ్డాడని మండిపడ్డారు. 

సీఎం జగన్‌కు మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ అని.. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో హామీల్లో 98.5 శాతం అమలు చేశామని మంత్రి మేరుగు నాగార్జన తెలిపారు. సీఎం జగన్ సిద్ధాంతమే అందరికీ శ్రీరామరక్ష అని చెప్పారు. నాలుగేళ్లలో పేదలకు రూ.2.11 లక్షల కోట్లు డీబీటీ ద్వారా వారి ఖాతాల్లో జమచేశామని..నవరత్నాల పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలంతా వైసీపీతో  ఉన్నారని స్పష్టం చేశారు.