నష్టపరిహారం అడిగితే వ్యవసాయశాఖమంత్రి ఏమన్నారంటే..?

నష్టపరిహారం అడిగితే వ్యవసాయశాఖమంత్రి  ఏమన్నారంటే..?

హైదరాబాద్ : వడ్ల కొనుగోలుపై బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని సీరియస్ అయ్యారు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మంగళవారం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రైతు సమస్యలపై బీజేపీ నేతలకు అవగాహన లేదన్నారు. యాసంగిలో వడ్లు కొంటరా లేదా అనేది కేంద్రం తేల్చాలన్నారు. ఒక క్వింటాల్ వడ్లకి ఎన్ని కిలోల బియ్యం ఇయ్యాలె అనేది కేంద్రమే నిర్ణయిస్తుందన్నారు. ఇది కూడా తెలియకుండా మిల్లర్లతో టీఆర్ఎస్ నేతలు కుమ్మక్కయ్యారని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. రైస్ మిల్లుల కొనుగోళ్లు అన్నీ FCI అనుమతితోనే జరుగుతాయన్నారు. రైతుల గురించి మీరు మాట్లాడాలనుకుంటే ఢిల్లీకి పోయి అగ్రి చట్టాలకు ఆమోదం కల్పించడన్నారు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం తమదని.. ఇక మీ డ్రామాలు ఆపాలన్నారు.

తేమను చెక్ చేసే విధానాన్ని కూడా FCI పెట్టిందన్నారు. మట్టి,రాళ్లు తీసేసి అసలు ధాన్యాన్ని కొనడం తప్పనిసరి అనే విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇన్ని తప్పులు కేంద్రం చేస్తుంటే .. ఇవన్నీ తెలియకుండా టీఆర్ఎస్ వడ్లు కొనడంలేదంటే మేమేం చేయాలన్నారు. దమ్ముంటే మీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ సమస్యను క్లియర్ చేయాలని తెలిపారు నిరంజన్ రెడ్డి. కోడిగుడ్లు వేస్తే మేమేం చేయాలని బీజేపీ నేతల పని తనాన్ని చూసే రైతులు ఆగ్రహంతో దాడులు చేస్తున్నారని చెప్పారు. ఎంతో కష్టపడి పడ్డించిన ధాన్యం వర్షానికి తడవడంతో.. రైతులు కష్టాలపాలయ్యారని.. ఏమైనా నష్టపరిహారం ఇస్తారా అని.. విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. వర్షం ప్రకృతి అని చేయిపెట్టి ఏమైనా ఆపుతమా అని మాటదాటేశారు వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.