ధర్మపురి ఎన్నిక చెల్లదన్న పిటిషన్‌‌‌‌‌‌‌‌ కొట్టివేతకు నిరాకరణ

ధర్మపురి ఎన్నిక చెల్లదన్న పిటిషన్‌‌‌‌‌‌‌‌ కొట్టివేతకు నిరాకరణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదన్న ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ కొట్టేయాలన్న అభ్యర్థనను కోర్టు డిస్మిస్‌‌‌‌‌‌‌‌ చేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 2018లో ఎమ్మెల్యేగా కొప్పుల గెలుపు చెల్లదని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ పిటిషన్​దాఖలు చేశారు. ఆయన వేసిన ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కొట్టేయాలని మంత్రి కొప్పుల హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ ఆ పిటిషన్ పై విచారణ చేపట్టారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను విచారణ చేయకుండానే దాన్ని కొట్టేయాలని కోరడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక చెల్లదంటూ అడ్లూరి వేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌లో ఈవీఎంల వీవీ ప్యాట్స్‌‌‌‌‌‌‌‌ లెక్క పెట్టకుండానే ఎన్నిక ఫలితం వెల్లడించారని ఆక్షేపించారు. ఈ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకంగా జరిగిందన్నారు. కొప్పుల ఎన్నిక చెల్లదని ప్రకటించాలని, తానే ఎమ్మెల్యేగా గెలిచినట్లని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి పిటిషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. దీనిపై కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌ వేసిన ఇంటర్‌‌‌‌‌‌‌‌లాకెట్రీ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌(ఐఏ)లో తనపై దురుద్దేశంతోనే ఆయన ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారని, దీన్ని కొట్టేయాలని హైకోర్టును కోరారు. రాజకీయ కారణాలతో వేశారని, దీన్ని కొట్టేయాలని కొప్పుల వేసిన ఐఏను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. 

కొనసాగనున్న విచారణ

కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌కు 441 ఓట్ల మెజార్టీ లభించింది. ఈవీఎంల వీవీ ప్యాట్స్‌‌‌‌‌‌‌‌ లెక్క పెట్టకుండానే ఫలితాన్ని ప్రకటించడం వల్లే కొప్పుల గెలుపొందారని పిటిషనర్‌‌‌‌‌‌‌‌ వాదన. వాస్తవానికి ఆయన ఓడిపోయారని, తప్పుడు ఫలితం కారణంగానే ఎన్నికయ్యారని, ఆయన ఎన్నిక చెల్లదని ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్​కోరుతున్నారు. దీంతోపాటు కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌పై తాను గెలుపొందినట్లుగా ప్రకటించాలని అభ్యర్థిస్తున్నారు. ధర్మపురి (ఎస్సీ) సీటుకు 2009 నుంచి వరుసగా మూడు సార్లు వారిద్దరి మధ్య పోటీ జరిగింది. గతసారి కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌ కేవలం 0.3 శాతం ఓట్లతో (441 ఓట్ల ఆధిక్యత) గెలుపొందారు. 2009లో పీఆర్పీ18 శాతం ఓట్లను చీల్చినప్పటికీ రెండు శాతం లోపు ఓట్లతోనే కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌పై గెలుపొందారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఊపు నేపథ్యంలో 13 వేలకుపైగా ఓట్లతో విజయం సాధించారు. 2018లో 441 ఓట్లతో గట్టెక్కారు. కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌ వేసిన ఐఏ డిస్మిస్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఆయన ఎన్నిక చెల్లదని అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ వేసిన ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు విచారణ చేయనుంది.