ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. జీ ప్లస్ 3, జీ ప్లస్ 4 విధానంలో ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు పొంగులేటి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. మధ్య తరగతి వర్గాలకు ఇల్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మొదటి విడతలో 3లక్షల 80 వేల ఇళ్లు మంజూరు చే శామన్నారు. ప్రస్తుతం 3 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని.. మూడు రకాల ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు పొంగులేటి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తోందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
గత ప్రభుత్వ నిర్వాకం ఇలా..
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పింది. 9 సంవత్సరాల క్రితం 2015 అక్టోబర్లో 2,91,057 ఇండ్లను మంజూరు చేసింది. టెండర్లు పిలిచింది 2,29,451 ఇండ్లకు మాత్రమే. గత ప్రభుత్వం దిగిపోయేవరకు పూర్తి అయినవి 1,13,535 మాత్రమే. ఎన్నికల ముందు ఆదరాబాదరాగా 61,606 లబ్ధిదారులకు పంపిణీ చేసింది.
