విడతల వారీగా అర్హులందరికీ ఇండ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

 విడతల వారీగా అర్హులందరికీ ఇండ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి, వెలుగు : అర్హులందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో రూ.6.42కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. అనంతర ంకూసుమంచి జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు.

 త్వరగా కంప్లీట్​ చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఇందిరమ్మ ఇంటికి టన్ను గోదావరి ఇసుకు రూ.1100 , ఇతర అసరాలకు రూ.1300 ఇస్తున్న శాండ్​ బజార్​ను కూసుమంచి తహసీల్దారు ఆఫీస్​లో మంత్రి ప్రారంభించారు. 

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో నేలకొండపల్లి, ఖమ్మం రూరల్​ మండలాలలకు చెందిన 124 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు, కూసుమంచికి చెందిన 18 మందికి కాటమయ్య రక్ష కిట్లు, పాలేరులోని నాలుగు మండలల్లో 20 మంది క్రైస్తవ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కూసుమంచి మండలంలో 62 స్కూళ్ల​కు 1700 జతల షూస్​ అందజేశారు. అనంతరం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, ప్రజలు పొందుతున్న ప్రయోజనాలను వివరించారు. 

కాగా, మల్లేపల్లిలో డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల సమస్య పరిష్కరించాలని, అర్షులైన వారికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్ర మంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, ఆర్ అండ్ బీ ఈఈ  పవార్, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, కూసుమంచి మండల తహసీల్దార్ రవికుమార్, ఏడీఏ సతీశ్​, ఏవో వాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.