లక్ష్మీ ఇల్లు కట్టుకో.. గృహప్రవేశానికి వస్తాను .. కుభీర్​ మహిళతో మంత్రి పొంగులేటి

లక్ష్మీ ఇల్లు కట్టుకో.. గృహప్రవేశానికి వస్తాను .. కుభీర్​ మహిళతో మంత్రి పొంగులేటి

కుభీర్, వెలుగు: లక్ష్మీ తొందరగా ఇల్లు కట్టుకో.. గృహప్రవేశానికి వస్తాను’ అని కుభీర్​కు చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలితో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో అంతర్నీ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన జాదవ్ లక్ష్మితో మాట్లాడారు. ‘లక్ష్మీ ఎలా ఉన్నావు. ఇల్లు నిర్మాణం ఎంతవరకు వచ్చింది? అధికారులు అకౌంట్​లో డబ్బులు వేశారా?’ అని అడగ్గా.. వేశారు సార్ అని లక్ష్మి సమాధానం చెప్పింది. దీంతో ‘ఇల్లు తొందరగా నిర్మించుకో.. వీలు చూసుకుని గృహప్రవేశానికి వస్తాను’ అని మంత్రి అన్నారు.

 దీంతో ‘రండి సార్ దావత్ ఇస్తాను’ అని లక్ష్మి సమాధానమిచ్చింది. మంత్రి ఇంటికి వస్తానని చెప్పడంతో లక్ష్మి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. అనంతరం ఎంపీడీవో సాగర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని, బిల్లులను లబ్ధిదారుల అకౌంట్​లో జమ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇండ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.