మే నెలాఖరులోపు సర్వేయర్ల ఫైనల్​లిస్ట్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి

మే నెలాఖరులోపు సర్వేయర్ల ఫైనల్​లిస్ట్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి

కోహెడ (హుస్నాబాద్), వెలుగు : ఈ నెల 27లోపు రూ.6 వేల మంది లైసెన్స్‌‌డ్‌‌ సర్వేయర్లను ఫైనల్‌‌ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి చెప్పారు. ఎంపికైన వారికి మూడు నెలల పాటు ట్రైనింగ్‌‌ ఇచ్చి, ప్రతీ రెవెన్యూ మండలానికి 8 మందికి తగ్గకుండా నియమిస్తామని ప్రకటించారు. మంగళవారం హుస్నాబాద్‌‌ లో జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరైన మంత్రి పొంగులేటికి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్​మనుచౌదరి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆగస్టు 15లోపు వీలైనన్ని భూ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు.

ఈ నెలఖరులోపు మొదటి విడతగా 4,50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఫైనల్ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెంచులు వారి ఉప తెగలకు 9872 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు 3500 ఇండ్లతో పాటుగా అదనంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్​లింగమూర్తి, సింగిల్​విండో చైర్మన్​శివ్వయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు.