రేపు (ఆగస్టు 31న )అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు..కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

రేపు (ఆగస్టు 31న )అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు..కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

రిజర్వేషన్ బిల్లును ఆగస్టు  31న అసెంబ్లీలో  ప్రవేశ పెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు  వెల్లడించారు మంత్రి పొంగులేటి, పొన్నం. ఈ సందర్భంగా.. కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు మంత్రులు.  42 శాతం రిజర్వేషన్లపై కట్టుబడి ఉన్నామన్నారు. 

రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేస్తామని.. స్థానిక ఎన్నికలపై కోర్టు తీర్పుకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. అన్ని పార్టీలు రిజర్వేషన్ బిల్లుకు సహకరించాలన్నారు. అసెంబ్లీలో 42 శాతం బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయని చెప్పారు మంత్రి.  గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పంచాయతీ రాజ్  2018 చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 
 
 భారీ వర్షాలతో  రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందన్నారు. సెప్టెంబర్ 1న పంట నష్టంపై ఉన్నతాధికారులతో సమావేశం ఉంటుందన్నారు.భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు మంత్రి పొంగులేటి. 2020-23 ధాన్యానికి సంబంధించిన అంశాలపై  కేబినెట్ లో చర్చించామన్నారు.  పేమెంట్స్ సరిగా చేయనవారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు మంత్రి.   మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం రికవరీ చేయాలని  కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.