
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో ఇటీవల మరణించించిన ముగ్గురు జర్నలిస్టు కుటుంబాలకు శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. హైదరాబాద్ లోని నాంపల్లిలోని మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో మెదక్ పట్టణానికి చెందిన చందాయిపేట చంద్రశేఖర్ గౌడ్, కొల్చారంనకు చెందిన మల్లేశం, తూప్రాన్‌కు చెందిన రాజయ్య కుటుంబ సభ్యులు చెక్కులను అందుకున్నారు. ఆయా కుటుంబాల అకౌంట్లలో ఈ నెల నుంచి రూ.3 వేల పింఛన్ జమ అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జర్నలిస్ట్యూనియన్నాయకులు పాల్గొన్నారు.