ఎన్ఎండీసీ అభివృద్ధికి కృషి చేస్తా : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఎన్ఎండీసీ అభివృద్ధికి కృషి చేస్తా : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉత్ప త్తి నిలిపివేసిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ)ని పునరుద్ధరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఆదివా రం ఎన్ఎండీసీ మాజీ ఉద్యోగులు, ఐఎన్టీయూసీ పట్టణాధ్యక్షుడు బానోతు బాలునాయక్ ఆధ్వర్యంలో ఖమ్మం క్యాంప్​ఆఫీస్​లో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశ్రామికంగా పాల్వంచ అభివృద్ధి చెందడంలో ఎన్ఎండీసీ పాత్ర ఉందని, ఆ కర్మాగారాన్ని అభివృద్ధి చేసి తీరుతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాలే జానకి రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, రాము నాయక్, సక్రు నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.