
మధిర, వెలుగు: మధిర మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పలు ప్రైవేటు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆత్కూరు గ్రామానికి చెందిన ఖమ్మంపాటి సురేశ్ వివాహా వేడుకకు హాజరై నూతనవధూవరులను ఆశీర్వదించారు. ఇల్లూరు గ్రామ మాజీ సర్పంచ్ రామారావు కుమారుడిని ఆశీర్వదించారు. సిద్దినేనిగూడెం గ్రామంలో వేమిరెడ్డి లక్ష్మారెడ్డి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సైదల్లీపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు నెల్లూరు పెద్ద పుల్లయ్యను పరామర్శించారు.
మంత్రి వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాంబాబు, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మధిర మండల, పట్టణ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, మిర్యాల వెంకటరమణగుప్తా, సొసైటీ ప్రెసిడెంట్ కటికల సీతారామిరెడ్డి, దేవిశెట్టి రంగారావు, యన్నం కోటేశ్వరరావు, అమరవాది సత్యనారాయణ రెడ్డి, బాలు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.