
- హాజరైన మంత్రి తుమ్మల, ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు
కల్లూరు, వెలుగు : కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సతీమణి మాధురి దంపతుల నూతన గృహప్రవేశం గురువారం ఘనంగా నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టారాగమయి దయానంద్, రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, టీజీఐడీసీ చైర్మన్ మువ్వ విజయబాబు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీవైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ హాజరై పొంగులేటికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరావుతో పాటు ఎమ్మెల్యేలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో ఏఎంసీచైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, దోమ ఆనంద్ తదితరులు
పాల్గొన్నారు.