రూ.77 కోట్లతో తిరుమలాయపాలెం అభివృద్ధి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రూ.77 కోట్లతో తిరుమలాయపాలెం అభివృద్ధి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి/ఖమ్మం రూరల్, వెలుగు :   తిరుమలాయపాలెం మండలాన్ని రూ.77.50 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంగళవారం తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్​ మండలాల్లో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.  రైతు వేదిక వద్ద లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్​ చెక్కులు, కొత్త రేషన్ కార్డులను అందజేశారు.

 ఏదులాపురం మున్సిపల్ ప్రాంతంలో పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్​కు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో భాగంగా పలు రోడ్లకు శంకుస్థాపనులు చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.200 కోట్లతో 3 వేలకు పైగా పిల్లలు చదువుకునేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేసుకున్నామని గుర్తుచేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్​చార్జ్ విద్యాధికారి నాగ పద్మజ, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎంఈవో శ్రీనివాసరావు, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ  పవార్,  మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ, తిరుమలాయపాలెం మండల ఎంపీడీవో సిలార్ సాహెబ్, తహసీల్దార్ విల్సన్, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ఆత్మ కమిటీ చైర్మన్ శివ రామకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ బుర్ర రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అశోక్, మాజీ జడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.