జీహెచ్ఎంసీ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలం సందర్భంగా తీసుకున్న జాగ్రత్తల గురించి GHMC, వాటర్ బోర్డ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వర్షాకాలం ప్లాన్ ను అధికారులు మంత్రికి తెలియజేశారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారుల సమాధానం సంతృప్తిగా లేదని అసహనం వ్యక్తం చేశారు.
వాటర్ లాగింగ్ పాయింట్స్ కంటే ఎక్కువ చోట్ల ఎందుకు నీళ్ళు ఆగుతున్నాయని ప్రశ్నించారు. శానిటేషన్ అధ్వన్నంగా ఉందన్న మంత్రి.. ఎందుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని నిలదీశారు. చెత్త కుండి పాయింట్స్ దగ్గర వీధి కుక్కల బెడద ఎందుకు పెరుగుతుంది ప్రశ్నించారు. నగరంలో శానిటేషన్ విషయంలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాయంత్రం పీక్ అవర్స్ లో ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరిగా ఫీల్డ్ మీదే ఉండాలని చెప్పారు పొన్నం. సమీక్ష సమావేశంలో వర్షాకలంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు GHMC అవధికారులు. మీటింగ్ కు GHMC, వాటర్ బోర్డ్ ,ఎలక్ట్రిసిటీ ,పోలీస్ అధికారులు హాజరయ్యారు. స్ట్రీట్ లైట్స్ విషయంలో నిర్లక్ష్యంగా పని చేస్తున్న ఎలక్ట్రికల్ అధికారులపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, మంత్రి పొన్నం అసహనం వ్యక్తం చేశారు.
అధికారుల దృష్టకికి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.