జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి.. అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేయాలి: పొన్నం

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి.. అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేయాలి: పొన్నం

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అభ్యర్థి ఎవరైనప్పటికీ పార్టీ విజయం కోసం అందరూ కలి సికట్టుగా పని చేయాలన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో  జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ బూత్ ఇన్ చార్జీలు, ముఖ్య నేతలతో ఆయన ఇవాళ సమావేశం నిర్వహించారు. అజారుద్దీన్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డెయిరీ ఫెడరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎన్ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి ఈ సమావేశంలో పాల్గొన్నా రు.

 ఈ సందర్భంగా మంత్రి పొన్నం మా ట్లాడుతూ.. ఎర్రగడ్డ డివిజన్లో నేతలంగా ఐక్యంగా పని చేయాలన్నారు. డివిజన్ కో ఆర్డినేషన్ కమిటీ, బూత్ కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డివిజన్ లోని ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్న మంత్రి.. బూత్ ల వారీగా 46 బూత్ ల్లో  ప్రజల నుంచి వినతులు స్వీకరించాలన్నారు. డివిజన్ లో తాను పాదయాత్ర చేసి సమస్య లు పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి తీసుకు పోవాలన్నారు.


జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఆరు నెలలలోపు ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి వుంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల్లో హడావుడి మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీల్లోనూ ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు. టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. జూబ్లీహిల్స్​నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో స్లమ్​ఏరియాలు ఎక్కువగా ఉన్నాయి.

►ALSO READ | ఆగస్టు17 నుంచి రాహుల్ గాంధీ ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’

దీంతో ఇక్కడ పాగా వేయాలంటే కాస్త మాస్​ఫాలోయింగ్ ఉన్న వారికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్​శాతం 47.49 నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా మూడు పర్యాయాలు విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్​కు 64,212 ఓట్లు వచ్చాయి.16,337 ఓట్లతో ఆధిక్యంతో మాగంటి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్​తో ఉన్న అవగాహనలో భాగంగా మజ్లిస్ పోటీ చేయలేదు. త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో మాగంటి కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చే యోచనలో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టు సమాచారం