
- అంబులెన్స్‌లలో ఆక్సిజన్ లేదనేది పూరిగా అబద్ధం: మంత్రి పొన్నం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై రాజకీయాలు చేయవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రమాదం సందర్భంగా ఉపయోగించిన 108 అంబులెన్స్‌లలో ఆక్సిజన్ అందుబాటులో లేదన్న ఆరోపణలను సోమవారం ఓ ప్రకటనలో ఖండించారు. ‘‘గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై రాజకీయాలు చేయడం సరికాదు. అంబులెన్స్‌లలో ఆక్సిజన్ లేదని కొందరు చెప్పడం అవాస్తవం! మేం, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లతో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో తనిఖీలు చేశాం.
అన్ని అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సౌకర్యాలు ఉన్నాయి. ప్రమాద సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారం రెస్క్యూ టీమ్ స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. బాధితులకు ఆక్సిజన్ అందలేదన్న వాదనలను నేను ఖండిస్తున్నాను. తప్పుడు ప్రచారం ఆపండి’’ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.