హైదరాబాద్ లో ఇవాళ డిసెంబర్ 11న 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి. ఈవీ ట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను రాణిగంజ్ డిపోలో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, టీజీఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు అనధికార ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు.
ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు రూట్లలో 260 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే. వీటితో కలిపి మొత్తం 325 ఆర్టీసీ ఎలక్ట్రానిక్ బస్సులు నడుస్తున్నాయి. నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ పలు రూట్లలో నడుపుతోంది. రాణి గాంజ్ డిపోలోఒకేసారి 100 బస్సులు చార్జ్ అయ్యేటట్లు 25 ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు.
►ALSO READ | Gold Rate: బుధవారం గోల్డ్ అప్.. కేజీకి రూ.9వేలు పెరిగిన వెండి.. తెలంగాణలో రేట్లు ఇవే..
గ్రేటర్ హైదరాబాద్లో కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థ కోసం 2027 నాటికి ఓఆర్ఆర్ పరిధిలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, క్లీన్ అండ్ గ్రీన్ రవాణా వ్యవస్థను నడిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బస్సుల వినియోగంతో వ్యక్తిగత వాహన కొనుగోళ్లు తగ్గి, ప్రజా రవాణా వాడకం పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తున్నది.

