కబ్జాదారులకు మంత్రి పొన్నం వార్నింగ్

కబ్జాదారులకు మంత్రి పొన్నం వార్నింగ్

ప్రభుత్వ భూముల కబ్జాలు చేస్తే  కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి సూచించారు మంత్రి పొన్నంప్రభాకర్. ఎన్నికల వరకు రాజకీయాలు ఉండాలని..తర్వాత అభివృద్ధే లక్ష్యంగా ఉండాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కొత్త చెరువును పరిశీలించారు పొన్నం. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాజకీయ లకు అతీతంగా ప్రజాపాలన సాగుతుందన్నారు. ప్రభుత్వానికి సూచనలు ఇస్తే తాము స్వీకరిస్తామని చెప్పారు. 

స్వచ్చదనం పచ్చదనం  నిత్య జీవితంలో బాగం కావాలని సూచించారు పొన్నం. నిరంతరం పర్యావరణ పరిరక్షణపై అందరు భాగస్వామ్యం కావాలని చెప్పారు. అందరు మొక్కలు నాటాలి,దానిని కాపాడాలని చెప్పారు. హుస్నాబాద్ కొత్త చెరువు అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంత రోడ్లకు త్వరలోనే నిధులు విడుదల చేస్తామని తెలిపారు.