రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి :  మంత్రి పొన్నం ప్రభాకర్
  •     మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సతీమణి మంజులతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు, యువత హాజరయ్యారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ, సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ వ్రతాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు,ప్రజలు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారికి అన్నదానం నిర్వహించారు.