ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష

ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష

హైదరాబాద్ సిటీలో బోనాల సందడి ప్రారంభమైంది. తెలంగాణలో జులై 7 నుండి ఆగస్టు 4 వరకు నెల రోజుల పాటు ఆషాఢమాస బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఇక, జూలై 21, 22వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో 21న బోనాల జాతర, 22న రంగం, అంబారి అమ్మవారి ఊరేగింపు, పలారం బండ్ల ఊరేగింపు ఉంటుంది.

 ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆషాడ మాస బోనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అధికారులతో వరుస సమీక్షలు చేస్తున్నారు.  జూన్ 27వ తేదీ గురువారం ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్లపై ఆలయం దగ్గర హైద్రాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు జరుగకుండా బోనాల జాతర ముగిసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా,  జులై 5వరకు అమ్మవార్ల ఆలయాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలనీ అధికారులను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీ లత, నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమా, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ, కార్పొరేటర్స్ తోపాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.