నీటి ఎద్దడి నివారణకు చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్​

నీటి ఎద్దడి నివారణకు చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​, వెలుగు : నియోజకవర్గంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్​లో రూ.18.50 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో మాట్లాడి రూ.3.50 కోట్లు తెప్పిస్తానని చెప్పారు.

తన వద్ద ఉన్న రూ.1.50  కోట్ల నిధులు కలిపి మొత్తం రూ.5 కోట్లతో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంటు నిర్మిస్తామని చెప్పారు.  క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ 307 హాబిటేషన్స్, 160 గ్రామాలు, హుస్నాబాద్ మున్సిపాలిటీలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను ఆదేశించారు.

హుస్నాబాద్​లో వంద పడకల ప్రభుత్వ దవాఖానను 250 పడకలుగా అప్​గ్రేడ్​ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిపారు. హైదరాబాద్​లోని దవాఖానాల్లో నియోజకవర్గ ప్రజలకు వైద్య సహాయాన్ని అందించేందుకు ఒక వ్యక్తిని నియమించామన్నారు. అనంతరం కలెక్టర్ మనిదీప్​చౌదరితో కలిసి మంత్రి హుస్నాబాద్​లోని రేణుకాఎల్లమ్మ ఆలయంలో అనివేటి మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహంలో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్​చైర్​పర్సన్​ఆకుల రజిత, వైస్​చైర్​పర్సన్​ అనిత, జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఆర్డీవో బెన్​శాలోమ్​, ఎంపీపీ మానస తదితరులు పాల్గొన్నారు.