సోమవారం ( జనవరి 5 ) శాసన మండలిలో మాట్లాడుతూ విదేశీ విద్యను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. విదేశీ విద్య ఒక పెట్టుబడి అని.. బీద కుటుంబాల విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని అన్నారు. గురుకుల పాఠశాల, హాస్టల్ నిర్మాణాలు కొనసాగుతున్నాయిని అన్నారు. తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రాజీవ్ యువ వికాసం కొన్ని కారణాల చేత ఆగిపోయిందని.. తిరిగి కొనసాగిస్తామని అన్నారు మంత్రి పొన్నం.
గత పదేళ్ళలో కేసీఆర్ బీసీలకు ఏమీ చేయలేదని.. తమ హయాంలో బీసీల సంక్షేమానికి ఇప్పటి వరకు ఖర్చు చేశామని.. బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని అన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి తమ ప్రబుత్వం కట్టుబడి ఉందని అన్నారు.కళ్యాణ లక్ష్మీ అనేది ఎక్కడ పెండింగ్ లేదని.. జిల్లా స్థాయిలో అక్కడక్కడా కొంత ఆలస్యం జరిగితే జరగొచ్చని స్పష్టం చేశారు మంత్రి పొన్నం.
బీసీ వర్గాల మీద గౌరవంతోనే బీసీ కుల గణన చేశామని అన్నారు.తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. అన్నింటికీ మూలం విద్యనే అని అన్నారు. గతంలో గురుకులాల అద్దె కట్టని పరిస్థితిలో ఉన్నారుని.. కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
