చిన్న పిల్ల‌ల కోసం ప్ర‌త్యేక కోవిడ్ సెంట‌ర్ ఏర్పాటు

చిన్న పిల్ల‌ల కోసం ప్ర‌త్యేక కోవిడ్ సెంట‌ర్ ఏర్పాటు

చిన్న పిల్లల ప్రత్యేక కోవిడ్ సంరక్షణ కేంద్రంను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఖ‌మ్మంలో మొదటి చిన్నపిల్లల కోవిడ్ సంరక్షణ కేంద్రం
థ‌ర్డ్ వేనే దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టిన మంత్రి పువ్వాడ

ఖ‌మ్మం జిల్లా: క‌రోనా థ‌ర్డ్ వేను దృష్టిలో పెట్టుకుని చిన్న పిల్ల‌ల్లో క‌రోనా రాకుండా ముందు జాగ్ర‌త్త‌గా ప్ర‌త్యేక కోవిడ్ సెంట‌ర్ ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు ర‌వాణా శాఖ‌ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్. బుధ‌వారం ఆయ‌న ఖ‌మ్మం జిల్లా క‌లెక్ట‌ర్ తో క‌లిసి ప్ర‌భుత్వ హాస్పిట‌ల్ లో చిన్న పిల్ల‌ల కోవిడ్ సంర‌క్ష‌ణ సెంట‌ర్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి అజ‌య్ కుమార్.. కోవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌న్నారు. 3వ దశ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న వార్తల క్ర‌మంలో తెలంగాణ రాష్ట్రంలోనే చిన్నపిల్లల కోసం మొదటి ఆసుపత్రిని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పారు చేశామ‌న్నారు. త‌ల్లిదండ్రులు చిన్న‌పిల్ల‌ల విష‌యంలో కేర్ తీసుకోవాల‌ని సూచించారు మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్.