
బయ్యారం ఉక్కు పరిశ్రమపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రం కోసం ఎందుకు కొట్లాడటం లేదన్నారు. ఉక్కు పరిశ్రమ రాదని కేంద్రం ప్రకటననా.? లేక కిషన్ రెడ్డి వ్యక్తిగతమా? చెప్పాలన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందని చెప్పింది కేంద్రమేనన్నారు. ఉక్కు ఇవ్వడానికి కేంద్రానికి సంకల్పం లేదన్నారు. తెలంగాణ ఏర్పడటం ప్రధానికి ఇష్టం లేదని.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఇష్టం లేనట్లు కిషన్ రెడ్డి మాటలున్నాయన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ ఇక్కడ పెడితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కేంద్రానికి సహకరిస్తుందన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తుందన్నారు. ఫ్యాక్టరీ సాధ్యం కాకపోతే అక్కడి ప్రజల ఆగ్రహానికి గురికావడానికి కేంద్రం సిద్ధంగా ఉండాలన్నారు.