పిల్లల్లో కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచండి: మంత్రి సబితా

పిల్లల్లో కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచండి: మంత్రి సబితా

హైదరాబాద్, వెలుగు: పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారు స్వేచ్ఛగా స్కూళ్లకు వెళ్లే వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడి భద్రత అంటే సదుపాయాలు, సెక్యూరిటీ మాత్రమే కాదని, దీనిని మరో కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్డీలో స్టూడెంట్ల రక్షణ, భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడారు. పిల్లలు ఎక్కువ సమయాన్ని స్కూళ్లల్లోనే గడుపుతున్నందున అక్కడి పరిసరాలతో సహా వాతావరణాన్ని సురక్షితంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందని పేర్కొన్నారు. స్టూడెంట్లలో అభద్రతా భావం ఉంటే వారు చదువుపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేరన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో పలు భద్రతా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. మరింత సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. 

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, స్టూడెంట్ల భవిష్యత్తు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్ల భద్రత విషయంలో ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, వీటిని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందో ప్రభుత్వానికి సూచనలు చేయాలని కమిటీ సభ్యులను మంత్రి కోరారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, అదనపు డీజీపీ స్వాతీ లక్రా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్ దేవసేన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, డీఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు.