స్కూల్స్ కు సెలవంటూ ప్రచారాన్ని నమ్మొద్దు

స్కూల్స్ కు సెలవంటూ ప్రచారాన్ని నమ్మొద్దు

తెలంగాణలో స్కూల్స్ బంద్ అంటూ జరుగుతోన్న ప్రచారంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు.  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో కేసీఆర్ ఆదేశించారని ఆమె ట్విట్టర్లో తెలిపారు.  సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మొద్దన్నారు. మాస్కులు, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరపెడుతోంది.. భారత్ లో ఒమిక్రాన్ వచ్చినట్లు నిర్ధారణ కాలేదు. కానీ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాలతో  రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి.