ప్రతిపక్షాలవి హత్యా రాజకీయాలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రతిపక్షాలవి హత్యా రాజకీయాలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

 హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతోనే రాష్ట్రంలో అలజడులు సృష్టించా లని, అశాంతిని రేకెత్తించాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపిం చారు.

ఇటీవల జరిగిన పలు సర్వేల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తేలడంతో నిరాశకు గురైన పార్టీలు హత్యా రాజకీ యాలకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాజకీయంగా ఎదు ర్కో లేక భౌతిక దాడులకు దిగడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంఘ విద్రోహక చర్యలకు పాల్పడటాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ అంగీకరించరన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, రాజకీయాల్లో హత్యా రాజకీయాలు పనికి రావన్నారు.