విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలి: మంత్రి సబితారెడ్డి 

విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలి: మంత్రి సబితారెడ్డి 

విద్యార్థులు చక్కగా చదువుకోని తమ లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. మణికొండ మున్సిపల్‌లో రూ.1.70 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఇవాళ ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడాడిన మంత్రి.. రాష్ట్రంలోనే ఎక్కడా కూడా పురపాలక సంఘాలు సొంత నిధులతో పాఠశాలలు ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పడు మొట్టమొదటి సారిగా మణికొండ మున్సిపల్ సొంత నిధులతో నిర్మించిన ఈ పాఠశాల ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. 

విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాలను నిర్మించడానికి కృషి చేసిన మణికొండ మున్సిపాలిటీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రి అభినందనలు తెలిపారు. కాగా,వైస్‌ చైర్మన్‌ మణికొండలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు, అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.