సీపీఆర్ శిక్షణలో మంత్రి సబితారెడ్డి

సీపీఆర్ శిక్షణలో మంత్రి సబితారెడ్డి

సీపీఆర్తో ప్రాణాలను రక్షించొచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కొంగరకలాన్ లో వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో సీపీఆర్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. సీపీఆర్ చేయడంతో ప్రాణాలను కాపాడవచ్చునని, దీనిపై ప్రజా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మంత్రి సబితారెడ్డి ఓ బొమ్మకు సీపీఆర్ చేశారు. 

ప్రతి ఒక్కరూ సీపీఆర్ గురించి తెలుసుకోవాలని రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఏమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కల్వకుర్తి ఏమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ లు హజరైయ్యారు.