సర్టిఫికేట్లు ఇవ్వకపోతే కాలేజీలపై చర్యలు తీసుకుంటం

సర్టిఫికేట్లు ఇవ్వకపోతే కాలేజీలపై చర్యలు తీసుకుంటం

బాగ్ అంబర్ పేటలోని నారాయణ కాలేజీ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిని ఆదేశించారు. విచారణ నివేదిక అందిన అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. 

ఇదిలా ఉంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తైన విద్యార్థుల సర్టిఫికెట్లు వారికి ఇవ్వనిపక్షంలో కాలేజ్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలు బోర్డు ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. ప్రైవేటు కాలేజీలు స్టూడెంట్స్  సర్టిఫికేట్లు నిలిపివేయకుండా చూడాలని జిల్లా అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే విద్యార్థులు డీఐఈఓకు ఫిర్యాదు చేయాలని సూచించింది.