మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించిన సబితాఇంద్రారెడ్డి

మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించిన సబితాఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గత నాలుగు రోజుల నుండి కురుస్తోన్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో పలు కాలనీలలో మంత్రి సబితాఇంద్రారెడ్డి పర్యటించి.. నాలా పనులను పర్యవేక్షించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని..ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. అధికారులు, సిబ్బంది పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూశారన్నారు. పలు కాలనీలలో నాలా పనులు పూర్తికానందున ఆ వార్డుకు సంబంధించిన కార్పొరేటర్, మున్సిపల్ సిబ్బంది ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.