వచ్చే ఏడాది వరకు అప్ప చెరువు ఆక్రమణలను తొలగిస్తాం

V6 Velugu Posted on Sep 28, 2021

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ అప్ప చెరువు చుట్టు ఆక్రమణలను తొలగిస్తామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి అప్ప చెరువును ఆమె పరిశీలించారు. వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి కబ్జాలు తొలగించి, స్థానికులు ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు సబితా. గత ఏడాది, ఈ ఏడాది అనుకున్నదానికంటే ఎక్కువ వర్షాలు రావడంతో అప్ప చెరువు తెగిందని చెప్పారు ప్రకాశ్ గౌడ్. చెరువు కట్టకు వేగంగా మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు గగన్ పహాడ్ దగ్గర జాతీయ రహదారి పైకి అప్ప చెరువు నుంచి వచ్చే నీటి ప్రవాహం తగ్గింది. దీంతో భారీ వాహనాలను అనుమతిస్తున్నారు పోలీసులు.

Tagged Rajendra nagar, Minister Sabitha Indra reddy, , Inspects, appa cheruvu

Latest Videos

Subscribe Now

More News