మేడారం జాతరకు రండి

మేడారం జాతరకు రండి

హైదరాబాద్, వెలుగురాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క – సారక్క జాతరకు రావాలని గవర్నర్ తమిళిసైని బుధవారం రాజ్​భవన్​లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోచంపల్లి చేనేత శాలువా, సంప్రదాయ వెండి కుంకుమ భరిణ, మేడారం ప్రసాదంను గవర్నర్ కు అందజేశారు. గిరిజన శాఖ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూతో కలిసి మంత్రి సత్యవతి.. గవర్నర్ కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ తర్వాత మేడారం చరిత్ర, విశిష్టత తెలిపే విధంగా ఆహ్వాన పత్రికను రూపొందించిన తీరును మంత్రి సత్యవతి రాథోడ్ గవర్నర్​కు వివరించారు. సమ్మక్క -సారక్క జాతరలో భక్తుల సౌకర్యార్థం ఈ ఏడాది చేస్తున్న ఏర్పాట్లు, పర్యావరణాన్ని పరరక్షించేందుకు ప్లాస్టిక్ నివారణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

మంత్రి కేటీఆర్‌‌‌‌కు ఆహ్వానం

మేడారం సమ్మక్క సారక్క జాతరకు రావాలని స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు. గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన ప్రత్యేక ఆహ్వాన పత్రికను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోతు కవితతో కలిసి బుధవారం కేటీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ జాతర ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.