నా గిరిజన ప్రజలకు పోడు పట్టాలు ఇవ్వడం అదృష్టం: మంత్రి సత్యవతి

నా గిరిజన ప్రజలకు పోడు పట్టాలు ఇవ్వడం అదృష్టం: మంత్రి సత్యవతి

మహబూబాబాద్ జిల్లాలో 24 వేల 108  గిరిజనులకు 64 వేల ఎకరాలకు పైగా పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తున్నమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జూన్ 30వ తేదీ శుక్రవారం ఆమె మంత్రి కేటీఆర్ తో కలిసి జిల్లాలో పోడు భూముల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాను పుట్టిన గడ్డ నుండి నా గిరిజన ప్రజలకు పోడు పట్టాలు ఇవ్వడం అదృష్టం గా భావిస్తున్నాను అన్నారు. రాష్ట్రంలో గిరిజనుల చేతిలో ఉన్న భూములు 12 లక్షల ఎకరాలు కాగా..గత ప్రభుత్వాలు పోడు రైతులకు 3లక్షల ఎకరాలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు మంత్రి సత్యవతి.

ఇవ్వాళ ఒకే రోజు 4 లక్షల 60 వేల 369  ఎకరాల పోడు భూములకు 1 లక్ష 51 వేల 146 మంది పోడు  రైతులకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని మంత్రి కొనియాడారు. శతాబ్ది కాలంలో జరగని అభివృద్ధి తెలంగాణలో దశాబ్దిలో జరిగిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుందన్నారు. మహబూబాబాద్ జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్