
ఆంద్రప్రదేశ్ శ్రీసత్యసాయిజిల్లాలో మంత్రి సవిత అనుచరులు వీరంగం చేసి ఓ వ్యక్తిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పరిగి గ్రామానికి చెందిన వడ్డే సునీల్ (24) అనే వ్యక్తి కియా పరిశ్రమలో పని చేస్తున్నాడు. శుక్రవారం విధులకు వెళ్లిన సునీల్ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ..ఆయన తల్లిదండ్రులు లక్ష్మీదేవి, నారాయణప్పలు పరిశ్రమ దగ్గరకు వెళ్లారు.
కియా పరిశ్రమ చెట్టు ఎదురుగా ఉన్న వేప చెట్టుకు తమ కుమారుడు విగతజీవిగా వేలాడుతున్నాడని రోధిస్తున్నారు. తమ కుమారుడిని మంత్రి సవిత అనుచరులు హతమార్చి ... ఆత్మహత్యగా చిత్రీకరించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సవిత అనుచరులు కొట్టడవ వల్లే తన కొడుకు సునీల్ చనిపోయాడంటూ తల్లి లక్ష్మీదేవి ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సునీల్ తల్లి ఆరోపణలపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.