
ములుగు జిల్లాలో రమేష్ అనే యువకుడి ఆత్మహత్య ఘటన రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ ముదిరింది. ఈ క్రమంలో జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క బీఆర్ఎస్ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలకు బీఆర్ఎస్ నేతలే కారణమని.. అమాయకులను రెచ్చగొట్టి ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్నారని అన్నారు సీతక్క. పోలీసు సమగ్ర విచారణలో పూర్తి నిజాలు బయటపడతాయని అన్నారు.
పదేళ్లలో మీరు కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎన్ని..? 18 నెలల్లో మేము ఎన్ని కేసులు పెట్టామో రికార్డులతో బహిరంగచర్చ కు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ నేతలకు నా సవాల్ విసిరారు సీతక్క. ఒక గిరిజన బిడ్డను కాబట్టే తనను టార్గెట్ చేశారని అన్నారు.కేసీఆర్, కేటీఆర్ కుటుంబం తనను టార్గెట్ చేసారని.. మొన్నటి ఎన్నికల్లోనూ ఓడించాలని ప్రయత్నించి విఫలమయ్యారని అన్నారు మంత్రి సీతక్క. తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక రాజకీయ కుట్రలు చేస్తున్నారని అమండిపడ్డారు సీతక్క.
సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. మంత్రుల పర్యటన నేపద్యం లో నిరసనలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని.. ఇందిరమ్మ ఇళ్లను అడ్డుకునే ప్రయత్నంపైనా ఇవ్వాళ్టి మా కార్యక్రమాన్ని పోలీసుల సూచనతో వాయిదా వేసుకున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పై తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా రేపు ములుగు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తామని అన్నారు మంత్రి సీతక్క.