
- బీజేపీ దాడిని ఖండించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: కరాచీ బేకరీపై బీజేపీ దాడు లు అమానుషమని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బేకరీపై దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకులు తమ నిజ స్వరూ పాన్ని మరో సారి చాటుకున్నారని, వారికి ఈ దేశం, హిందువుల ప్రయోజనాలు ముఖ్యం కాదని, విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడమే బీజేపీ పని అని మండిపడ్డారు. కరాచీ బేకరీ ఈ దేశ బిడ్డలదని, దేశవిభజన సమయంలో హిందూ మతస్తులైన కరంచంద్ కుటుంబం హైదరాబాద్ వచ్చి కరాచీ బేకరీ స్థాపించారన్నారు.
ప్రధాని, హోం మంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ తో సహా చాలా రాష్ట్రాల్లో కరాచీ బేకరీ తన వ్యాపారం నిర్వహిస్తోందని తెలిపారు. యుద్ధ సమయంలో ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే ఇలాంటి చిల్లర పనులను బీజేపీ మానుకోవాలని సూచించారు. కరాచీ బేకరీకి అండగా ప్రజా ప్రభుత్వం ఉంటుందన్నారు.