- వెంకటాపూర్ మండలంలో పెద్దమ్మగుడి ప్రారంభం
ములుగు, వెంకటాపూర్(రామప్ప), వెలుగు : ప్రజా అభీష్టం మేరకు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ అన్నారు. సోమవారం ములుగు, వెంకటాపూర్ మండలాల్లో పర్యటించి చలివేంద్రంతో పాటు వెంకటాపూర్ లో రూ.30లక్షల పీఆర్ నిధులతో నిర్మించిన పెద్దమ్మగుడిని ప్రారంభించారు.
అనంతరం మండలంలోని లక్ష్మీదేవిపేటలో రామాలయ గుడి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ సర్పంచ్ మాడిశెట్టి సుగుణ స్వామి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, పంచాయతీరాజ్ రాష్ట్ర డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, కాంగ్రెస్ వెంకటాపూర్ మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ పాల్గొన్నారు.

