ఫ్రీ బస్ అంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నరు.. మహిళలు ఎదిగితే BRS ఓర్వలేకపోతుంది: మంత్రి సీతక్క

ఫ్రీ బస్ అంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నరు.. మహిళలు ఎదిగితే BRS ఓర్వలేకపోతుంది: మంత్రి సీతక్క

హైదరాబాద్: మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని కాంగ్రెస్ సర్కార్  కోరుకుంటే బీఆర్ఎస్ ఏడుస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు. మహిళలు ఎదిగితే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ తీసుకొస్తే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని బీఆర్ఎస్‎పై ఫైర్ అయ్యారు. మంగళవారం (జూన్ 9) సికింద్రాబాద్‎లోని పరేడ్ గ్రౌండ్స్‎లో ప్రభుత్వం మహిళా శక్తి సభ నిర్వహించింది. 

మంత్రి సీతక్క ఈ సభకు హాజరై ప్రసగించారు. రాష్ట్రంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రూ.61 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని తెలిపారు. రూ.2 వేల కోట్ల వడ్డీ డబ్బులను ప్రభుత్వమే చెల్లింస్తుదని చెప్పారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఉపాధి కల్పిస్తున్నామన్నారు. 

►ALSO READ | తెలంగాణలో 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.. దేశంలో ఇదే రికార్డ్: మంత్రి ఉత్తమ్

మూడు వేలకు పైగా మహిళా సంఘాలకు ఐకేపీ సెంటర్లు ఇచ్చామని.. వీటి ద్వారా ఆడబిడ్డలకు గతేడాది రూ.159 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో చదువుకోని 12 లక్షల మంది మహిళలకు చదువు చెప్పిస్తున్నామన్నారు. 60 ఏళ్లు దాటిన మహిళలను కూడా మహిళా సంఘాల్లో చేర్చుతున్నామని తెలిపారు. గ్రామీణ మహిళలు స్వయంగా తయారు చేసే ఉత్పత్తులను ప్రపంచానికి చూపిస్తున్నామని అన్నారు.