ఎవరూ వద్దనుకుంటే ఒక్కరే మిగులుతారు : మంత్రి సీతక్క

ఎవరూ వద్దనుకుంటే ఒక్కరే మిగులుతారు : మంత్రి సీతక్క

నిర్మల్: ఎంపీ ఎన్నికల్లో   పనితీరును బట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని కార్యకర్తలకు, నాయకులకు మంత్రి సీతక్క  సూచించారు. నిర్మల్ లో ఇవాళ జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో  సీతక్క  పాల్గొని మాట్లాడారు.  దేశంలో పార్టీని కాపాడేందుకు గాంధీ కుటుంబం ఎంతో శ్రమిస్తున్నదన్నారు.  మణిపూర్ లాంటి ఎన్నో ఘటనలపై రాహుల్ గాంధీ పోరాడారని చెప్పారు. కేంద్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు.  ఆదిలాబాద్​పార్లమెంటు పరిధిలో ఒక్కరే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారని పేర్కొన్నారు. 

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే మీపై సీఎంకు మరింత అభిమానం పెరుగుతుందన్నారు.100% ఆదిలాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ గెలుపొందుతుందని దీమా వ్యక్తం చేశారు.  అందరినీ కలుపుకొని వెళ్లిన వారే నిజమైన నాయకులని, గ్రూపులను ప్రోత్సహించే వారు నిజమైన నాయకులు కాదని చెప్పారు. ఎవరు వద్దు అని అందరినీ పక్కన పెడితే ఒక్కరే మిగులుతారని హెచ్చరించారు.  పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాయకుల పై ఉందని అన్నారు. అటవీ శాఖ అధికారుల ఇబ్బందులతోనే  ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా రోడ్డు రవాణా అభివృద్ధిలో వెనుకబడిందని తెలిపారు.